బేగంపేట జులై 31,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆగస్టు 2 వ తేదీన సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినిమహంకాళి అమ్మవారి బోనాల జాతర జరగనున్న నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అధికారులతో కలిసి ఆలయ పరిసరాలలో తిరిగి ఏర్పాట్లనుపరిశీలించారు. ఏర్పాట్ల విషయంలోఅధికారులకు పలుసూచనలు చేశారు. ఈ
సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతరకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2 వ తేదీనతెల్లవారుజామున అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమై, 3 వ తేదీన రంగం, అంబారీ పై
అమ్మవారి ఊరేగింపు, సాయంత్రం ఫలహారం బండ్ల ఊరేగింపు తో జాతరముగుస్తుందని చెప్పారు. భక్తులకు డెక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర వాలంటీర్లు భక్తులకుస్వచ్చందంగా సేవలు
అందిస్తారని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి బోనాల విశిష్టత ను పెంచిందని గుర్తు చేశారు.అంతేకాకుండా బోనాల ఉత్సవాలను ఘనంగానిర్వహించాలనే ఆలోచనతో దేవాలయాలకు కేసీఆర్ ప్రభుత్వమే మొట్టమొదట నిధులు ఇచ్చిందని వివరించారు. నేడు బోనాలఉత్సవాలను విశ్వవ్యాప్తంగా నిర్వహించడం నిజంగా మనకు ఎంతోసంతోషదాయకం అన్నారు.
ఎమ్మెల్యే వెంట జోనల్ కమిషనర్ మంగ తాయారు, వాటర్ వర్క్స్ GM శ్రీధర్, ఆలయ EO మనోహర్ రెడ్డి, AE చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు కిషోర్, సతీష్, కోటేశ్వర్ గౌడ్, కొండాపురం మహేష్ యాదవ్, గణేష్, జనార్దన్, రాజు, చంద్ర ప్రకాష్, అరుణ్ భట్, జయరాజ్, సత్యనారాయణ, డెక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, పలు స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు తదితరులు ఉన్నారు.

