అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంలో ఆసుపత్రులు, ల్యాబ్ లపై చర్యలు తీసుకోకపోవడం పై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం….కేసులు నమోదు లో జాప్యం ఎందుకు అన్న మహిళా కమిషన్.డాక్టర్ హుస్సేన్ జాడ కనిపెట్టకపోవడం,కేసునమోదు చేయకపోవడంపై తీవ్ర అసహనం.కేసుల నమోదులో జాప్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయాని హెచ్చరించిన మహిళా కమిషన్….

బేగంపేట నవంబర్ 7,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంలో ఆసుపత్రులు, ల్యాబ్ లపై చర్యలు తీసుకోకపోవడం పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సూత్రధారులుగా భావించిన ఆసుపత్రులు ఫెర్టిలిటీ సెంటర్లపై కేసులు నమోదు చేయడం లో జాప్యం ఎందుకు అని మహిళా కమిషన్ ప్రశ్నించింది. శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఈ అంశం పై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న
డాక్టర్ హుస్సేన్ జాడ కనిపెట్టకపోవడం, కేసునమోదు చేయకపోవడం
పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేసుల నమోదులో జాప్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయాని, మహిళా కమిషన్ హెచ్చరించింది.నిరుపేద మహిళల నుండి అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంలో ఆసుపత్రులు,
ల్యాబ్ లపై చర్యలు తీసుకోకపోవడం పై మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కేవలం కొంతమంది ఎజెంట్లపైనే కేసులు నమోదు చేసి.ప్రధాన సూత్రధారలుగా ఆరోపణలు వస్తున్న ఆసుపత్రులపై, ల్యాబ్ లపై కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం పట్ల మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులు, సెంటర్లపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలుతీసుకోవాలని సంబంధిత
అధికారులను మహిళా కమిషన్ ఆదేశించినప్పటికి ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై మహిళా కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
బాధిత మహిళలను మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారదపరామర్శించిన సమయంలో ప్రధానంగా ఇందిరా ఐవిఎఫ్ సెంటర్, నర్మద ఫర్టిలిటి సెంటర్, ఓయాసిస్ ఫర్టిలిటి సెంటర్, సద్గురు A R T సెంటర్, పద్మజ ఫర్టిలిటి సెంటర్లతో పాటు డాక్టర్ హుస్సేన్ పేర్లు ప్రస్తావించి బాధితులు పిర్యాదు చేసారన్నారు.కానీ ఇప్పటి వరకు డాక్టర్ హుస్సేన్ జాడ కనిపెట్టకపోవడం మరియు కనీసం కేసునమోదు చేయకపోవడం పైనా మహిళా కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.మహిళల శారీరక స్వేచ్ఛ, గౌరవం, ఆరోగ్యానికి సంబంధించి అక్రమంగా వ్యవహరించినవారు ఎంతటి వారైనా వారిపైన కేసులు నమోదు చేయకుండా జాప్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయాని మహిళా కమిషన్ హెచ్చరించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *