గ్రామాలలో ఇంటి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలని ఈవో పి ఆర్ డి పి. ఓబులేసు అన్నారు, మండలంలోని వేముల బండ గ్రామంలో శుక్రవారం ఇంటి పన్ను వసూళ్లపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటిని కలిసి పన్ను వసూళ్లు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు, దీన్ని దృష్టిలో ఉంచుకొని డిమాండ్ ప్రకారం ఇంటి పన్ను వసూలు చేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు, గ్రామంలో 2 లక్షల 27 వేల949 వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు73 వేల373 వసూలు చేశారు, మిగిలిన మొత్తాన్ని మార్చి చివరినాటికి 100% పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కోటయ్య. పంచాయతీ కార్యదర్శి టి స్వర్ణలత. సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,
పన్ను వసూళ్లపై దృష్టి సారించండి
24
Feb