విద్యార్థులు క్రమ శిక్షణతో కష్టపడి  చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి – యువ పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్

తాళ్లూరు మండలం తూర్పు గంగవరం శ్రీ గీతాంజలి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న యువ వైసీపీ నాయకులు, పారిశ్రామికవేత్త శిద్దా సుధీర్ కుమార్ గారు. ఈ సందర్భంగా శిద్దా సుధీర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణతో కష్టపడి  చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులకు,విద్య నేర్పిన గురువులకు,పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. విద్యార్థులు  పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.శ్రీ గీతాంజలి హై స్కూల్ డైరెక్టర్ యాతం శ్రీనివాసరెడ్డి శిద్దా సుధీర్ కుమార్ కు పుష్పగుచ్ఛంతో సాదర  స్వాగతం పలికి మెమెంటో అందచేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తాళ్లూరు ఎస్.ఐ. ప్రేమ్ కుమార్,స్కూల్   సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *