అర్హలందరికి సంక్షేమ పథకాలు అందించాలని వార్డు సచివాలయాల్లో సంక్షేమ పథకాల కోసం వచ్చే వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. దర్శి పట్టణంలో 4వ సచివాలయపరధిలో పుట్టబజారు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. వారికి అందిన లబ్ధిని తెలిపుతూ బుక్లెట్ అందించారు. పూర్తి స్థాయిలో అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తంచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ అర్హత ఉండి ఎవైనా సాంకేతిక లోపాలతో అగిన లబ్దిని తిరిగి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించానని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ఆగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి గత ప్రభుత్వంలో జరగలేదని ప్రజలు గుర్తించి సీఎం వైఎస్ జగనన్నకు మరలా ఆశీర్వాదం అందించి 2024లో సీఎంను చేసి కృతజ్ఞతలు తీర్చుకోవాలని కోరారు. ముందుగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి, కార్యదర్శి గోను నారాయణ రెడ్డి, కౌల్సిలర్లు వీసీ రెడ్డి, మేడటం, మోహన్ రెడ్డి మోహన్ బాబు, బాబు, నారాయణ రెడ్డి: ముత్తినీటి సాంబయ్య, దారం వాసుదేవ రెడ్డి, యర్రయ్య, కట్టెకోట హరీష్, అన్నవరపు రవి, శేషం రమణయ్య, కోటయ్య, ఎన్. శ్రీనివాస రెడ్డి, కిక్కి రమణా రెడ్డి, పాణేం రహమాన్, అంబటి వెంకటేశ్వర రెడ్డి, మిల్లర్ బుజ్జి పాశం జయసింహా, గురవయ్య, కాలేషా వలి, జెసీఎస్ కన్వినర్ ఎదురు కోటిరెడ్డి, సొసైటీ చైర్మన్ వేమి రెడ్డి చెన్నా రెడ్డి, అధికారులు మున్సిపల్ మున్సిపల్ కమీషనర్ మురళి , డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవి, ఎడీఈ పిచ్చయ్య, ఎఈ ప్రసాద్ హౌసింగ్ ఎఈ షాకీర్, విఆర్డీఓ మురళి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



