ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్ధులకు 2023-24 విద్యా సంవత్సరానికిగాను అందించే పుస్తకాలు, జేవీకే కిట్ల నిల్వలను శని వారం జిల్లా విద్యాశాఖాధికారి పి. రమేష్ పరిశీలిం చారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నిల్వలు, వస్తువుల నాణ్యతను పరిశీలించారు. డీఈవో రమేష్ మాట్లాడుతూ ..పాఠశాలలు ప్రారంభించే ఈ నెల 12 నాటికి ప్రతి ఒక్క విద్యా ర్థికి వీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవో రఘురామయ్యకు సూచించారు. మూడు సబ్జెక్టులకు చెందిన పుస్తకాలు, రాత పుస్తకాలు మినహా, అన్ని తరగతులకు సంబంధించినవి. అందుబాటులో ఉంచినట్లు వివరించారు. విద్యా కానుక కిట్లకు సంబంధించి బూట్లు రాలేదని, మిగిలిన ఇతర వస్తువులు అన్నీ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కొరత ఉన్నవి రెండు, మూడు రోజుల్లో అందించనున్నట్లు చెప్పారు.
వీటిని ప్రతి విద్యార్థికి అందించటంతో పాటు వాటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. పంపిణీ, నమోదు విష యంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు.

