వర్షాలు సకాలంలో పడి పాడి పంట లు సమృద్ధిగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు అన్నారు . ఈ కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శి మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు హాజరైనారు.మండలంలోని శంకరాపురం గ్రామంలో ఆదివారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ భూమిలో ఎద్దులతో అరక కట్టి నాగలితో మేడి పట్టి దుక్కి దున్నారు. రైతులకు ఆరాధ్యమైన నాగలి, గొర్రు, కాడిని పూజించి ఏరువాక సాగించారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతుకు ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడతామన్నారు. మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా టిడిపి మేనిఫెస్టో రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు మాట్లాడుతూ రైతు రాజ్యమే చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమన్నారు. నాగలితో దుక్కు దున్ని తగిన ఫలితం రావాలని పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మేదరమెట్ల వెంకటరావు మాట్లాడుతూ రైతులందరికీ సకాలంలో వర్షాలు పడి వాతావరణం అనుకూలించి మంచి పంటలు దిగుబడి రావాలని ఆకాంక్షించారు రైతులు పది కాలాలపాటు పచ్చగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోడిగం మస్తాన్, దొనకొండ మాజీ ఎంపీపీ నాగులపాటి శివ కోటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి కొక్కెర నాగరాజు, దర్శి మండల టిడిపి మాజీ అధ్యక్షులు చిట్టెం వెంకటేశ్వర్లు, మండల టిడిపి ఉపాధ్యక్షులు గుద్దేటి నారాయణరెడ్డి, మండలటిడిపి మాజీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపిటిసి సుంకర రాఘవరెడ్డి, శంకరాపురం సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, మాజీ సర్పంచ్, చావ బ్రహ్మయ్య, బద్రి గోపాల్ రెడ్డి, చాగంటి రాంబాబు, కాటూరి గురవయ్య, మేదరమెట్ల రాంబాబు, ఓబుల్ రెడ్డి, తాతపూడి తెల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.



