తాళ్లూరు మండలం లో
వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునః ప్రారంభమైనాయి. అయితే మొదటి రోజు కావటంతో ఆయా పాఠశాలలకు విద్యార్థులు స్పల్ప సంఖ్యలో హాజరు అయ్యాయి. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక (జెవికె) కిట్స్ను అందించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం రమేష్ అధ్యక్షతన సభను నిర్వహించారు. విద్యాకానుక కిట్స్ అందించటంతో పాటు పాఠశాలలకు నాడు- నేడు ద్వారా మౌళిక వసతులు అభివృద్ధి పరచి పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు ప్రభుత్వం సమకూర్చినదని వక్తలు కొనియాడారు. ఎంపీటీసీ బాల కోటయ్య, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం ఎస్ అంజిరెడ్డి, ఎస్ఏ సురేష్ తదితరులు పాల్గొన్నారు..
లక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెవికే కిట్స్కు విద్యార్థులకు అందించారు. హెచ్ఎం రత్నకుమార్. ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ పరమేశ్వర రెడ్డి, ఎస్ఏలు రవిచంద్రా రెడ్డి, పున్నయ్య, సరళ, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యాకానుక కిట్స్ పంపిణీని ఎంఈఓ జి. సుబ్బయ్య పర్యవేక్షించారు
పాఠశాలలు పునః ప్రారంభం- పలు పాఠశాలల్లో జెవీకే కిట్స్ అందజేత – పరిశీలించిన ఎంఈఓ జి. సుబ్బయ్య
12
Jun