ప్రభుత్వ పథకాలను వీఏఏలు పారదర్శకంగా రైతులకు అందేలా చూడాలని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు తెలిపారు. మాధవరం రైతుభరోసా కేంద్రంలో శుక్రవారం జరిగిన గ్రామ స్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీప్ సీజన్లో చేపడుతున్న ఈ-క్రాప్ నమోదు పారదర్శకంగా వుండా లని తెలిపారు. కార్యక్రమంలో వీఏఏ సుధీర్, సలహామండలి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
