కుమారుడు నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులతోపాటు తండ్రిని వేధిస్తూ పలుచోట్ల అప్పులు చేస్తూ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడనే అక్రోషముతో కుమారుడిని తండ్రి హతమార్చిన ఈ సంఘటన ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే …..పోలవరం గ్రామానికి చెందిన కుంచాల వెంకటేశ్వర్లకువ్కుంచాల సుబ్బారావు(35) కుమారుడు . వెంకటేశ్వర్లు కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ గ్రామంలో నమ్మకస్తుడిగా పేరు పొందాడు. అయితే ఆయన కుమారుడు కుంచాల సుబ్బారావు కూడా బేల్దారు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు లోనైనా సుబ్బారావు తరచూ బేల్దారి పనులకు వస్తానంటూ అనేక మంది వద్ద అడ్వాన్స్ తీసుకుంటూ …పనులకు వెళ్లకుండా నగదు తిరిగి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ కోణంలో తరచూ కుటుంబంతో తండ్రితో గొడవలు పడుతూ కుటుంబ పరువును వీధుల పాలు చేశాడు. ఈ కోణంలో గత రెండు మూడు రోజుల క్రితం తన మాటకు ఎదురు తిరిగితే ఎవరినైనా సరే హతమారుస్తా నంటూ బెదిరించాడు. ఈ విషయంపై తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకున్నారు. ఆదివారం రాత్రి గ్రామంలో అంకమ్మ కొలుపులు సందర్భంగా పూటుగా మద్యం సేవించి నిద్రపోతున్న కుమారుడు సుబ్బారావుని తండ్రి వెంకటేశ్వర్లు బలమైన ఆయుధంతో నరికి హత మార్చాడు. ఈ సంఘటనతో పోలవరం గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సంఘటన స్థలాన్ని ..దర్శి సిఐ జె రామకోటయ్య, ముండ్లమూరు ఎస్సై యు వి కృష్ణయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

