కొనకనమిట్ల మండలంలోని వెలిగండ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్, మాజీ సర్పంచ్ పాతకోట వెంకటకృష్ణారెడ్డి (75) గుండె పోటుతో శుక్రవారం హైదరాబా ద్ లో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధప డుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందు తున్న కృష్ణారెడ్డి గుండెపోటుకు గురైనట్లు బంధువులు తెలిపారు. కృష్ణారెడ్డి తండ్రి శ్రీరాములరెడ్డి, కృష్ణారెడ్డి భార్య రత్తమ్మ కూడా సర్పంచ్‌లుగా పని చేశారు. మొత్తం 40 ఏళ్లపాటు కృష్ణారెడ్డి కుటుంబం గ్రామ సర్పంచ్‌లుగా కొనసాగారు. కృష్ణారెడ్డి గతంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సేవలందిం చారు. కొనకనమిట్ల, పొదిలి మండల నాయకులకు వెన్నుదన్నుగా ఉంటూ వైఎస్సార్ సీపీ బలోపేతా
నికి తనవంతు కృషి చేశారు. కృష్ణారెడ్డి కుమార్తె ప్రస్తుతం బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారసుడుగా కృష్ణా రెడ్డి తమ్ముని కుమారుడు వెంకటరెడ్డి ప్రస్తుతం వెలిగండ్ల గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్నారు.
పలువురు సంతాపం
ఆయన మృతి చెందడం బాధాకరమని, పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడు కొండలు, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి అన్నారు.
