టిటిడి బోర్డు సభ్యులుగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా దర్శి వచ్చిన శిద్దా సుధీర్ బాబు శిద్దా యూత్ చేపట్టిన సేవా కార్యక్రమాల పాంప్లెట్ ను దర్శి లోని రోహిత్ పవన్ హాస్పిటల్ లో విడుదల చేశారు. శిద్దా సహకారంతో శిద్దా యూత్ ఆధ్వర్యంలో దర్శి కురిచేడు రోడ్డులో గల రోహిత్ పవన్ హాస్పిటల్, అమ్మ డిజిటల్ ఎక్సరే & డయాగ్నొస్టిక్స్ నందు 30% రాయితీతో కూడిన రక్త పరీక్షలు మరియు 30% రాయితీ తో కూడిన డాక్టర్ కన్సల్టెన్సీ సేవలను దర్శి నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నామని శిద్దా ప్రతినిధి మండాది సుబ్బారావు తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ చివరి వరకు 30% రాయితీతో కూడిన రక్తపరీక్షలు, డాక్టర్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నామని, షుగర్ పరీక్షలు పూర్తిగా ఉచితం అని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు నంబర్లను. 8978551111,9666399299 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎం.డి అచ్చనాల కోటేశ్వరరావు, శిద్దా అభిమానులు పాల్గొన్నారు.
