వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన కార్యాలయ ఇన్ చార్జ్ సందిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు రాజంపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ బైక్ ర్యాలీగా కొత్తరెడ్డిపాలెం, దర్శి పట్టణం మీదుగా ముండ్లమూరు మండలం పులిపాడు, బృందావనం కాలనీల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు హాజరై కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
