రైతులు తమ పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా లాభాలు పొందవచ్చని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం లో మంగళవారం క్షేత్ర పర్యటన నిర్వహించారు. వివిధ రకాల జాతులకు చెందిన 26 రకాల పంట లను 20 సెంట్లలో పండిస్తున్న పంటలను ఆయన పరిశీలించారు. ఆశక్తి ఉన్న రైతులు తమ ఇంటి ఆవ రణలో నిత్యవసర పంటలు సాగు చేసుకోవచ్చ న్నారు. అందుకు సంబంధించిన సలహాలు, సూచ నలు ప్రకృతి వ్యవసాయ ఇన్చార్జ్ నరసింహులు ఇస్తారని చెప్పారు. ఐసీఆర్పీలు అనంతలక్ష్మి, ఉమా దేవి, రైతు గూడా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

