బేగంపేట ప్రకాశం నగర్ లో ని శ్రీ రామలింగేశ్వర దేవాలయం లో పరిసరాలన్నీ చెత్తా చెదారం తో నిండిపోయాయి. ….నిత్యం దూప దీప నైవేద్యాలతో వెలు గొందాల్సిన ఆలయాలలో అపరిశుభ్ర పరిసరాలతో భక్తుల భక్తి భావాలను దెబ్బ తీస్తూ ఆటంకంగా మారాయి…ఆలయ ప్రాంగణం మొత్తం చెత్తా చేదారాలతో నిండి పోయింది. ఆలయం లో సమయ పాలన లేక పోవడం తో పాటు ఆలయ ఈ ఓ.సిబ్బంది పర్య వీక్షణ లేక పోవడం తో ఆలయానికి వచ్చే భక్తులు సంఖ్య నా నాటికి తగ్గి పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం అక్కడ ఎలాంటి రక్షణ కూడా లేదన్న అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్త మవుతున్నాయి.ఆలయ పరిసరాలతో పాటు ఆలయాలలో కూడా అదే విధమైన పరిస్థితులు వుండటం తో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు.ఆలయ ఈ ఓ పర్వెక్షణా లోపం సిబ్బంది నిర్లక్ష్యం బేగంపేట శ్రీ రామ లింగేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తుల పాలిట శాపం గా మారింది.ఇక్కడ హనుమాన్ ,రామలింగేశ్వర స్వామి, నవగ్రహాలు,శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయం,సాయిబాబా ఆలయం,శ్రీ వేంకటేశ్వర ఆలయాలతో పాటు అయ్యప్ప భక్తులు మాలధారణ వేసుకుని ఇక్కడ వుండేందుకు వీలుగా మండపం వుంది. ఈ ఆలయం లో పరిసరాలతో పాటు ఆలయాలలో కూడా పరిశుభ్రత పాటించకుండా వుండటం పైన భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమయ పాలన పాటించరా….
శ్రీ రామలింగేశ్వర దేవస్థానం లో ఆలయ అధికారులు,సిబ్బంది సమయ పాలన పాటించక పోవడం పట్ల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ .ఓ విటలయ్య ఈ ఆలయం తో పాటు మరో ఆలయానికి ఈ ఓ గా వ్యవహరిస్తుండటం తో ఈ ఆలయాన్ని గురించి పట్టించు కోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.మిగిలిన సిబ్బంది కూడా ఇష్టారాజ్యం గా వచ్చి పోతుండటంతో తో ఈ ఆలయం లో బయట వ్యక్తులు తమ వాహనాలను ఆలయప్రాంగణం లో పార్కింగ్ చేస్తున్నారని. కనీసం గేట్లు మూసి తీసే పరిస్థితి కూడా లేక పోవడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పండుగల సమయంలో మాత్రమే….
బేగంపేట నట్ట నడిబొడ్డున వున్న ఈ ఆలయ సముదాయం లో పండుగల సమయం లో నిర్వహించే పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు అవుతారు. మిగిలిన రోజులలో కూడా భక్తులు భారీగానే వస్తుంటారు. అయితే పరిసరాలు అపరి శుభ్రత కారణం గా, విష జంతువులకు ఆలయంగా మారే అవకాశం ఉందని.. కొందరు భక్తులు ఆలయానికి రావడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధిాకారులు ఈ ఆలయం పైన దృష్టి సారించాలని ప్రజలు.భక్తులు కోరుతున్నారు.











