సాధారణ వేగం ప్రతి అవసరాన్ని తీరుస్తుంది…………ఒక్క నిమిషంలో జీవితం ఏమి మారదు కానీ ఆ నిమిషం తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది………………

బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపీ జి. శంకర్ రాజు…………

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒక్క నిమిషంలో జీవితం ఏ మారదని కానీ ఆ నిమిషంలో చేసుకున్న నిర్ణయం జీవితాన్ని మారుస్తుందని అందుకే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ ఏసిపి జి శంకర్ రాజు అన్నారు. బేగంపేట పోలీస్ ట్రైనీ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎసిపి శంకర రాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు. సిగ్నల్ పడిన వెంటనే వాహనాన్ని నిలిపివేయాలన్నారు. కొందరు యువకులు సిగ్నల్ జంప్ చేసి వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆయన తెలియజేశారు .హైదరాబాద్ పోలీస్ పరిధిలో 2023 సంవత్సరంలో 65,413 ,20 22లో 42 261 సిగ్నల్ జంపింగ్ కేసులు నమోదయ్యా యన్నారు .ఎక్కువగా యువత ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ,సిగ్నల్ జంపింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, ఆయన అన్నారు. వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నారు. ద్విచక్ర వాహనంపై త్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 వరకు జరిమానా విధిస్తారని, మరియు మూడు నెలల లైసెన్సు సస్పెండ్ అవుతుందన్నారు. అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే 1700 జరిమానా విధిస్తారని చెప్పారు. 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 300 మంది పోలీస్ ట్రైనింగ్ విద్యార్థులు సి టి సి ఎ సి పి శ్రీనివాస నాయుడు ఆర్ ఐ కె ఎల్ నాయుడు ట్రాఫిక్ ట్రైనింగ్ బేగంపేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *