ఫిబ్రవరి 2024 ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలు సోమవారం విడుదల చేయడం జరిగినది. అందులో శ్రీహర్షిణి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించి విజయ దుందుభి మోగించారు. అందులో ఎం ఎస్ సి కంప్యూటర్ సైన్స్ 70 మంది విద్యార్థులు హాజరుకాగా 64 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినారు. అందులో కటారి యామిని (634 /700)మార్కులు సాధించి యూనివర్సిటీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు .వీ హర్షిత (628) మార్కులతో రెండవ స్థానాన్ని, కే గౌతమి (621) మార్కులతో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఎమ్ ఎస్ సి కెమిస్ట్రీలో 56 మంది విద్యార్థులు హాజరుకాగా 50 మంది ఉత్తీర్ణత సాధించినారు. అందులో చెరుకూరి మహిత (566/650) మార్కులతో యూనివర్సిటీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు .జి భావన (552) మార్కులతో రెండవ స్థానాన్ని, కే హేమ (546 )మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. ఎం ఎస్ సి మ్యాథమెటిక్స్ 38 మంది విద్యార్థులు హాజరుకాగా 30 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినారు. అందులో గుండ్రెడ్డి స్వప్న ( 483/600) మార్కులతో యూనివర్సిటీ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు .రెండవ స్థానాన్ని జి పుష్పలత ( 480) మార్కులతో, మూడవ స్థానాన్ని టీ సంపత్ కుమార్ (472 )మార్కులతో కైవసం చేసుకున్నారు. మరియు ఎమ్ ఎస్ సి ఫిజిక్స్ లో యూనివర్సిటీ స్థాయిలో కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించగా అందులో ఇద్దరు విద్యార్థులు శ్రీహర్షిణి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వారు కావడం గర్వకారణ మని ప్రిన్సిపాల్ వివరించారు. అత్యధిక మార్కులు సాధించి రికార్డు నెలకొల్పిన విద్యార్థినీ విద్యార్థులను, ఉత్తమ మార్కులకు కృషిచేసిన అధ్యాపక బృందానికి శ్రీ హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అభినందించారు.



