రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరు బాధ్యత …………………ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి టిటిఐ ఎసిపి జి శంకర్ రాజు…………..

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని , ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసిపి జి శంకర్ రాజు అన్నారు. బేగంపేట టిటిఐ ఆధ్వర్యంలో మలక్ పేట యశోద ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి రోడ్డు ప్రమాదాలు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ కొందరు వాహనదారులు సిగ్నల్స్ పడినా వాహనాలు ఆపకుండా వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. త్వరగా వెళ్లాలని ,ఆత్రుత వారిని ప్రమాదాలను బారిన పడేటట్లు చేస్తుందని, దీంతో వారితో పాటు ఇతర వాహనదారులు కూడా ప్రమాదాల భాదపడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా రెడ్ సిగ్నల్ పడినప్పుడు తప్పకుండా వాహనదారులు తమ వాహనాలను నిలిపి ఉంచాలన్నారు. 20 23వ సంవత్సరంలో 65,413, 20 22 లో 4261 సిగ్నల్ జంపింగ్ కేసులు నమోదయ్యా అన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదన్నారు 20 23లో 6173 మంది 20 24 సంవత్సరంలో 3500 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి టీటీఐ బేగంపేటలో కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలన్నారు కారులో ప్రయాణం చేసే సమయంలో తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలి అన్నారు .వాహనాలు నిర్లక్ష్యంగా నడపరాదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో 150 మంది వైద్య సిబ్బంది రిటైర్డ్ డిసిపి దివ్య చరణ్ గోపాలరావు జనరల్ మేనేజర్ ఆఫ్ ఆపరేషన్ హేమచంద్ర బాబు ఏజీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *