డెంగ్యూ వ్యాధి వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో బొద్దుకూరపాడు గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహనపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోడాక్టర్ మౌనిక మాట్లాడుతూ…. దోమ కాటు వలన వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు, మెదడువాపు వంటి వ్యాధుల గురించి తెలిపారు .ఈ వ్యాధులు రాకుండా, పరిసర ప్రాంతాలలో గృహాలలో ఉన్న నీటి ఆవాసాలలో దోమలు పెరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, దోమతెరలు వాడకం, పరిసరాల పరిశుభ్రత, ప్రతి శుక్రవారంను పాఠశాలలో ఫ్రైడే నీ డ్రై డేగా పాటించటం, గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తని సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకొని ఉచితంగా వైద్య సేవలు పొందాలని తెలిపారు. ఆయా కార్యక్రమంలో హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ , ఆరోగ్య ,ఆశా కార్యకర్తలు వైద్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
