ఫతేనగర్ నుంచి బేగంపేట వైపు వస్తున్న ఓ కారు బేగంపేట శ్రీ నల్ల పోచమ్మ ఆలయం మూలమలుపులో అతివేగంతో డివైడర్ను ఢీకొని ప్రమాదానికి గురైన సంఘటన శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో కారు ప్రయాణిస్తూ డివైడర్ ని ఢీకొంది అని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ కారు ముందు భాగం డామేజ్ అయింది.టి ఎస్ 8 జే ఏ 3975శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఫతే నగర్ వైపు నుంచి బేగంపేట వైపు వస్తుంది.కారు బేగంపేట శ్రీ నల్ల పోచమ్మ ఆలయం మూల మలుపులో అతి వేగంతో ప్రయాణిస్తూ నియంత్రణ కోల్పోయి రోడ్ మధ్యలోని డివైడర్ నీ బలంగా ఢీకొంది.కారు ప్రమాదానికి గురైన సమయంలో కారులో ముగ్గురు యువకులు వున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.అయితే వారు మద్యం మత్తులో డివైడర్ ను దీకొట్టరా లేక అతివేగాన్ని నియంత్రించ లేక డివైడర్ నీ డీ కొట్టరా అన్నది తెలియాల్సివుంది.అర్ధరాత్రి సమయం కావడం తో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాన్ని అక్కడి నుంచి పక్కకు పక్కకి తీశారు.

