వాసవి క్లబ్స్ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయి.– వీసీఐ అదనపు కోశాధికారి పువ్వాడ నాగ వెంకటనారాయణ.– ఉదయాస్తమ సేవలో భాగంగా నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన వాసవి క్లబ్స్.

వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ అనుబంధంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి 4 వేలకు పైగా ఉన్న క్లబ్బులు జూన్, జూలై నెలలో జరుగుతున్న డాన్ టు డస్క్ ఉదయాస్తమ సేవా కార్యక్రమాలలో సుమారు పది కోట్ల రూపాయలకు పైగా విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వాసవి క్లబ్ అంతర్జాతీయ అదనపు కోశాధికారి పువ్వాడ నాగ వెంకట నారాయణ తెలిపారు.
వాసవి జిల్లా 205 లోని రీజన్ 4 లోని ఐదు ఒంగోలు క్లబ్స్ వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ విజన్, వాసవి క్లబ్ మహిళా విజన్, వాసవి క్లబ్ కేసిజిఎఫ్ యూత్ మరియు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ జూన్ 21, 22 శని ఆదివారాల్లో నగరంలో అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ సూచించిన కార్యక్రమమాలలో భాగంగా ఉచిత మధుమేహ పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేశారు, చర్మకారులకు అవసరమైన పరికరాలను అందించారు, రైతులను, మాజీ సైనికులను సత్కరించారు, మానసిక రుగ్మత కలిగిన విద్యార్థులకు అవసరమైన కిట్లను, స్నాక్స్ పంపిణీ చేశారు మరియు మాతా శిశు వైద్యశాలలో సిమెంట్ బల్లలను ఏర్పాటు చేశారు. సంస్థ బలోపేతానికి నూతన సభ్యులను చేర్పించారు.
ఈ సందర్భంగా ఉదయాస్తమ కార్యక్రమాల పర్యవేక్షణకు విచ్చేసిన వీసీఐ అధికారి వెంకట నారాయణ, గెస్ట్ ఆఫ్ హానర్ అచ్యుత శ్రీనివాసరావులు మాట్లాడుతూ నగరంలోని వాసవి క్లబ్స్ సంస్థ నియమాలకు అనుగుణంగా కార్యక్రమాలను శనివారం నిర్వహించారని, మరి కొన్ని కార్యక్రమాలు ఆదివారం నిర్వహిస్తారని వివరించారు. సుమారుగా ప్రతి క్లబ్ 40 వేల రూపాయలకు తక్కువ కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. 1961లో స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ కల్వకుంట్ల చంద్రశేఖర గుప్తా క్లబ్ స్థాపించి సమాజ సేవకు నాంది పలికారని వారిని గుర్తు చేశారు. సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటారని, సేవలు మాత్రం సమాజంలోని అందరికీ చేయడం వాసవి క్లబ్స్ సభ్యుల సేవా నిరతికి నిదర్శనమని తెలిపారు. ఈ ఉదయాస్తమ సేవలు అన్ని రీజియన్ చైర్మన్ చలువాది సత్యనారాయణ నేతృత్వంలో, రీజియన్ కార్యదర్శి మద్దు అరవింద లక్ష్మి మార్గదర్శనలో వీసీఐ జిల్లా 205లో 4వ రీజియన్ లోని క్లబ్స్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శని ఆదివారాలు రెండు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ముందుగా అమలనాధుని వారి వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారి కార్యక్రమాల్లో భాగంగా నగరంలో అద్దంకి బస్టాండ్ లో చర్మకారులకి, ఉమా మనో వికాస కేంద్రం విద్యార్థులకు అవసరమైన కిట్లు స్నాక్స్ పంపిణీ చేశారు మాతా శిశు వైద్యశాలలో సిమెంట్ బల్లలను ఏర్పాటు చేశారు, మంగమూరు రోడ్డు రాధా గోవింద మందిరంలో గరుకు స్తంభాన్ని ఏర్పాటు చేశారు కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉచిత హోమియో శిబిరాన్ని ఏనుగు చెట్టు వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఇలా పలుచోట్ల పలు కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు, డి శ్రీనివాసరావు, భరత సింహ, కారంశెట్టి వెంకట సునీత, కార్యదర్శులు మద్దాలి శివ ప్రసాద్, కే పవన్ ఆత్మకూరి శ్రావ్య, క్లబ్ కోశాధికారులు బియ్యపు సంపత్ కుమార్, తాళ్లూరి శివ బ్రహ్మం, యం భవాని, జోన్ చైర్మన్లు చలువాది కవిత రాణి, పి గోవర్ధన్ మరియు క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *