బేగంపేట అక్టోబర్ 8 (జే ఎస్ డి ఎం న్యూస్) :
పవిత్ర ఆత్మల దినోత్సవం (నవంబర్ 2 వ తేదీన) నిర్వహించే అల్ సోల్స్ డే కు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ లోని క్యాథలిక్ గ్రేవ్ యార్డ్ కు చెందిన ఫాథర్ ఎం. ఆరోగ్యం, అధ్యక్షుడు జయరాజ్, అలెక్స్, సాలోమన్, రాజన్, జెరాల్డ్ డిసిల్వా లు కలిసి ఆహ్వానించారు. పవిత్ర ఆత్మల దినం సందర్భంగా ప్రార్ధనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్ల కు చొరవ తీసుకోవాలని కోరారు.
