పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఆటో గుర్తింపు – మహిళ మర్చిపోయిన నగదు ఉన్న పర్సు అప్పగింత

బళ్లమిట్ట సెంటర్‌కు చెందిన టి. విజయ సోమవారం ఆటోలో ప్రయాణించి గాంధీ రోడ్ వద్ద దిగే సమయంలో, తన వద్ద ఉన్న రూ.50,000 నగదు మరియు ఇంటి తాళాలు ఉన్న పర్సును ఆటోలో మర్చిపోయి వెళ్లిపోయారు. అనంతరం పర్సు కనిపించకపోవడంతో, అక్కడే ట్రాఫిక్ విధుల్లో ఉన్న గాంధీ రోడ్ రూట్ మొబైల్ పోలీస్ సిబ్బంది వై. వెంకట్రావు ని సంప్రదించి విషయం తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వెంటనే ఆయన ట్రాఫిక్ సీఐ జగదీష్ కి సమాచారం అందించగా, సీఐ ఎస్సై డి. శ్రీనివాసరావు, పీసీ వెంకట్రావు మరియు ఐటీ కోర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటో పోలీస్ నంబర్ (2925) మరియు ఆటో నంబర్ ఏ. పి 27 టి. ఈ వై 2625 (బజాజ్ ఆటో)ను గుర్తించారు.

తదనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న డేటా ఆధారంగా ఆటో యజమాని వివరాలు తెలుసుకొని, ఫోన్ ద్వారా సంప్రదించగా సోమవారం తన తండ్రి ఆటో నడిపినట్లు తెలిపారు. కొద్దిసేపటికి పర్సు ఆటోలోనే ఉన్నట్లు గుర్తించారు.

ఆటో యజమానిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, రూ.50,000 నగదు మరియు ఇంటి తాళాలు ఉన్న పర్సును బళ్లమిట్టకు చెందిన టి. విజయ మరియు ఆమె కుమారుడు టి. కిషోర్ గారికి ట్రాఫిక్ సీఐ జగదీష్ సమక్షంలో అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *