రామ్ గోపాల్ పేట మే 15,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డా.కోట నీలిమ జన్మదినోత్సవం సందర్భంగా రామ్ గోపాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్రికాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.సిటీ లైట్ చౌరస్తాలో త్రికాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోట కటౌట్ కి త్రికాల పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా త్రికాల మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకురాలు కోట నీలిమ జన్మదినం సందర్భంగా డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.ఆమె నేతృత్వంలో సనత్ నగర్ నియోజక వర్గం లోని రామ్ గోపాల్ పేట డివిజన్ లో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు : బల్వంత్ బాయ్ , లడ్డు , మాకు దుర్గయ్య , మాణిక్రం ప్రభు , వినయ్ , శ్రీకాంత్, రఘు ముదిరాజ్ , రఘు యాదవ్ , జయకృష్ణ , రాజేందర్ , శ్రీశైలం , లాలాబాయి , ఎల్లేష్ , నాగరాజ్ , నరేష్ , హేమంత్ , ఎస్ ఆర్ శివకుమార్ , సాదిక్ బాయ్ , శ్రీకాంత్ చారి , రాకేష్ అగర్వాల్ , వెంకటేష్ , మరియు కార్యకర్తలు పాల్గొన్నారు .

