కూకట్ పల్లి,మే 20,(జే ఎస్ డి ఎం న్యూస్)
కూకట్ పల్లి నియోజక వర్గం పరిధిలోని విజ్ఞానపురి కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం అధికారులకు పలు సూచనలు చేశారు.. ముఖ్యంగా డ్రైనేజ్ ఎత్తు పెరగడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీరు చేరడానికి ఇబ్బంది అవుతుందని అలాగే డ్రైనేజ్ ను రోడ్డుకు సమానంగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నాలాను సరిదిద్దాలని డ్రైనేజ్ లోకి వాటర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసే విధంగా అక్కడ పలు సూచనలు చేసారు. అనంతరం ఖాజా కుంట ఎస్టిపి ప్లాంట్ వద్ద నీరు శుద్ధి దశలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనివల్ల ఇబ్బంది పడుతున్నామని,దుర్వాసన వస్తుందని స్థానికులు తెలపగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఈ సమస్య ఎందుకు వస్తుందో గుర్తించి అలాగే చెరువులో కూడా, పూడిక తీసి ఆ నీరు నిలవ లేకుండా అక్కడ చెట్ల యొక్క వ్యర్ధాలను కూడా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, సంతోష్ , ప్రభాకర్, బొట్టు విష్ణు, పవన్, కాలనీ అసోసియేషన్ సభ్యులు రాజేష్ రెడ్డి, సుబ్బారెడ్డి,వాసు అనిల్ ,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..





