దర్శిలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మెడికల్ షాపులు బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు దర్శి మండల తాసిల్దార్ శ్రావణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో వారు పేర్కొంటూ.. దేశవ్యాప్తంగా పెద్ద కార్పొరేట్ ఫార్మసీ సంస్థలు భారీ రాయితీల పేరుతో ప్రజలను ఆకర్షిస్తూ చిన్న మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయోటిక్స్, ఇతర మందుల విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విధానాలకు నిరసనగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దర్శి ప్రాంతంలోని ప్రజలు, మెడికల్ షాపుల యజమానులు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.


