వర్షాలకు కురుస్తున్న కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు .సీఎం ప్రజావాణిలో లబ్ధిదారుల మొర.హౌసింగ్ సంస్థ ఎండితో మాట్లాడిన చిన్నారెడ్డి .సీఎం ప్రజావాణిలో 288 దరఖాస్తులు

హైదరాబాద్ జులై 31,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో కొల్లూరులోబి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో
నిర్మించిన నాసిరకం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుకురుస్తున్నాయని, ఆ ఇళ్లను మరమ్మతులు చేయించి ఆదుకోవాలని లబ్ధిదారులు సీఎం ప్రజావాణిలో ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డితో మొరపెట్టుకున్నారు.
శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన 243వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు తరలివచ్చారు.
చిన్నపాటి వర్షాలకే కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కురుస్తున్నాయని, ఇళ్లన్నీ జలమయమై ఆ ఇళ్లల్లో నివాసం ఉండలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంగణంలో మెయింటినెన్స్ కూడా సరిగా లేదని రవాణా సౌకర్యం కూడా లేదని లబ్ధిదారులు చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలు నాసిరకంగా జరగడం వల్ల ఈ సమస్యఉత్పన్నమవుతోందని చిన్నారెడ్డి కి వివరించారు. స్పందించినచిన్నారెడ్డి హౌసింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తో ఫోన్లో మాట్లాడి ఈ సమస్యలను వివరించి తక్షణమే చర్యలుతీసుకోవాలని సూచించారు. అధికారులను కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాంగణానికి పంపించి ఇళ్లను మరమ్మత్తులు చేయించే ప్రక్రియను వెంటనేప్రారంభిస్తామని హౌసింగ్ ఎండి గౌతమ్ తెలిపారు.
సి ఎం ప్రజావాణిలో
288 దరఖాస్తులు….
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన 243వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 288 ధరఖాస్తులు అందాయి.వాటిలో పంచాయతీరాజ్ – గ్రామీణ అభివృద్ధి శాఖకు 136 దరఖాస్తులు రెవెన్యూ శాఖకు 40, మున్సిపల్ శాఖకు 21, ప్రవాసి ప్రజావాణికి 02, ఇతర శాఖలకు 89 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *