ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రకేశరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఉత్తర్వులు వున్నప్పటికి, తాళ్లూరు మండలంలో ప్రకాశం జయంతి వేడుకలు జరుగలేదు. ఆదివారం కావటంతో అధికారులు కార్యా లయాలవైపు కన్నెతి చూడలేదు. సైమన్ గోబ్యాంక్ అంటూ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన ఆంధ్రకేశరి జయంతి వేడులకు జరపక పోవటం చర్చనీయాంశ మైంది. గతంలో ముఖ్య నేతల జయంతి, వర్ధంతి వేడకులు ఘనంగా నిర్వహించే వారు. గత కొంత కాలంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ జాతీయ స్థాయి నాయకులు కార్యక్రమాలకు ఖచ్చితంగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా తాళ్లూరులోని అధికారులు, ప్రజాప్రతినిధులు భేఖాతర్ చేసి తమ కేమీ పట్టనట్లు మిన్న కుండటం పై నర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి .
