శివరాంపురం రెవెన్యూ పరిధిలో రూ. 27 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ నబ్ స్టేషన్ ను సోమవారం ప్రారంభించనున్నట్లు విద్యుత్ ఎఈ తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు ముఖ్య అతిథిలుగా పాల్గొని నబ్ స్టేషన్ను ప్రారంభిస్తారు. అనంతరం మండలంలో పర్యటించనున్నట్లు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
