గోశాలలోని గోవులకు కొత్తపాలెం యువ రైతులు మేత సరఫరా

గుంటిగంగ నమీపాన గల పులి కొండ’ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన గోశాలలోని గోవులకు మేత కొరత లేకుండా కొత్తపాలెం గ్రామ యువ రైతులు తమ వంతుగా పచ్చిమేతను ఆదివారం గోశాలకు సరఫరా చేశారు. గోశాల లో లో గోవులకు మేత కొరతగా వుందన్న విషయం తెలియటంతో తమకు మేత కొరతగా వున్నా గోవులపై తమ కు ఉన్న మమకారంతో పలువురు రైతులు రెండు టక్కుల పచ్చి మేతను స్వయంగా కోసి ట్రాక్టర్లలో గోశాలకు తరలించారు. కొత్తపాలెంకు చెందిన మారం రామ్మోహన్ రెడ్డి, నాగార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్ది, మేడగం ప్రవీణ్ సాయి రెడ్డి, రమణారెడ్డి, మారం వెంకటరెడ్డి, శివరామిరెడ్డి, భగీరథరెడ్డిలు గోశాలకు మేతను నమకూర్చారు. గోవులకు స్వయంగా మేత పెట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. తాళ్లూరు వ్యవసాయాధికారి ప్రతాప్ రెడ్డి కోరిన పిదప, కొత్త పాలెం గ్రామానికి చెందిన వ్యవసాయశాఖలో పనిచేస్తున్న కోట రామిరెడ్డి తన స్నేహితులను వాట్సాప్ గ్రూప్ ద్వారా చైతన్య పరచటంతో యువకులు, యువ రైతులు తమ వంతు చేయూత అందించినట్లు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *