శ్యామ్ లాల్ బిల్డింగ్ గణపతి ఆలయం జంక్షన్ లో తాత్కాలికంగా రాకపోకలు బంద్..

బేగంపేట సెప్టెంబర్ 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రకాశం నగర్ డివిజన్ పరిధిలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ ఆర్ బి ఐ నివాసాల ముందు ఉన్న చెట్ల కొమ్మలను అధికారులు కొట్టివేస్తుండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేశారు.చెట్ల కొమ్మలు కొట్టిన అనంతరం తిరిగి రాకపోకలు యధావిధిగా కొనసాగనున్నాయి. వినాయక చవితి సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తగా చెట్ల కొమ్మలను అధికారులు కొట్టి వేస్తున్నారు.కొమ్మలను కొట్టి వేసి,వాటిని తొలగించిన అనంతరం ఆ మార్గంలో వాహనాల రాకపోకలు యధావిధిగా సాగనున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

చెట్లను తిరిగి నాటుతాం…. తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు.
శ్యామ్ లాల్ బిల్డింగ్ జంక్షన్ ఆర్ బి ఐ నివాసాల ముందు ట్రాఫిక్ కు అంతరాయంగా మారిన చెట్ల కొమ్మలను కొట్టిస్తున్నామని.త్వరలోనే వాటిని సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో తిరిగి (రీ లొకేట్ చేయిస్తామని) నాటుతామని తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏ సి పి జి.శంకర్ రాజు తెలియ జేశారు.స్థానికులు సహకరించాలని ఏ సి పి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *