“మురసు” తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటువిద్యుత్ అంతరాయాలు, ప్రమాదాల సమాచారాన్ని వెంటనే తెలియజేయండి -ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి

“మురసు” తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చే సారని
విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాల సమాచారాన్ని వెంటనే తెలియజేయండి ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

“మురసు” తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సంబంధిత సేవలను అందించేందుకు ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) పల్నాడు సర్కిల్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసిందని తెలిపారు .

తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశించారు.ప్రజలకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు, అలాగే విద్యుత్ ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే సమాచారం అందించేందుకు ప్రకాశం సర్కిల్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ప్రకాశం సర్కిల్ కంట్రోల్ రూం నంబర్
9440817491
అద్దంకి డివిజన్
9490611613
ఒంగోలు డివిజన్
9440817495
దర్శి డివిజన్
9491065264
కందుకూరు డివిజన్
9491052950

ప్రజలకు విజ్ఞప్తి:

తుఫాన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని సీఎండీ విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

విద్యుత్ సరఫరా అంతరాయాలు, విద్యుత్ ప్రమాదాలు లేదా ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ప్రజలను కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *