ఓటర్ల జాబితా నవీకరణకు వేగవంతం చెయ్యాలి

ఓటర్ల జాబితా నవీకరణకు వేగవంతం చెయ్యాలని దర్శి నియోజక వర్గ ఎల క్ట్రోరల్ అధికారి (ఈఆర్), స్పేషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. వి. ఎస్ లోకేష్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సూపర్వైజర్లు, బిఎల్ఎల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ఈ.ఆర్. ఓ లోకేష్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల చేర్పులు, ఆధార్ అనుసంధానం, తొలగింపు, పేర్లు ఎవైనా తప్పులకు సంబంధించి సంబంధిత ఫార్మ్ లను పూర్తి చేసి విచారణ చేపట్టి ఓటర్ల జాబితా నవీకరణకు సహకరించాలని కోరారు. తహసీల్దార్ కెవీ ప్రసాద్, డీటీ ఇస్మానియేల్రాజు, ఎస్ఏ మూర్తి, జెఏ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *