2023 అక్టోబర్ నుండి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇకపై జనన దృవీకరణ పత్రాలు తప్పనిసరిగా పొందాలని తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యాధికారిణి కె.మౌనిక తెలిపారు. 2023 అక్టోబర్ 1వ తేదీ నుండి జన్మించిన ప్రతి ఒక్కరూ జన్మించిన ప్రదేశం నుండే జనన దృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదు కోసం గత ఏడాది అక్టోబర్ నుండి కొత్త చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ నూతన చట్టం ప్రకారం విద్యా సంస్థలు, ఆధార్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు జారీ, వివాహ నమోదుకు తదితర నమోదు కొరకు జనన దృవీకరణ పత్రం తప్పనిసరిగా కావాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందాలన్నా జన్మించిన ప్రాంతం నుండి తీసుకోబడిన జనన దృవీకరణ పత్రం అవసరమన్నారు. దీనిపై ప్రజలలో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *