ఆర్ఓబి ఆర్ యు బి ల వద్ద భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి………దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్………………..

ఆర్ ఓ బి, ఆర్ యు బి, ల
వద్ద భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆదేశించారు. సికింద్రాబాద్ లోని రైలు నిలయం లో సోమవారం జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ .ధనుంజయలు అన్ని శాఖల ప్రిన్సిపల్ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ ,గుంతకల్, గుంటూరు ,మరియు నాందేడ్ మొత్తం ఆరు డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు డిఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఆర్ ఓ బీ కామా రోడ్ అండర్ బ్రిడ్జ్ ల ఆర్ యు బి ల వద్ద నీరు చేరకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. వర్షాకాలంలో నీటి ఎద్దడి సమస్య ఎక్కువగా తలెత్తే అండర్ బ్రిడ్జిలు అన్నిటిని గుర్తించేందుకు తప్పనిసరిగా వాటి వద్ద ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు .సరిపడా నీటి పంపింగ్ వ్యవస్థ ఏర్పాట్లు మరియు వాటర్ గేజ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు .వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ఆర్ యు బి ల వద్ద 24 గంటల నిఘా వ్యవస్థ ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. జోన్ లో మిగిలి ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్ల తొలగింపు స్థితిగతులపై ఆయన సమీక్షించారు. అక్రమ కార్యకలాపాలు అరికట్టేందుకు మరియు రైల్వే ఆస్తులను కాపాడేందుకు ప్రధాన రైల్వే యార్డులలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని డిఆర్ఎంల ను అరుణ్ కుమార్ జై న్ ఆదేశించారు. జోన్లో పొగను గుర్తించే పరికరాలు అగ్నిమాపక పరికరాలు నెలల స్థితిగతులపై చర్చించి అన్ని ఫైర్ సేఫ్టీ పరికరాలను సరిపడా అందుబాటులో ఉండేట్లు చూసుకోవాలని, ఆదేశించారు . ఆయా జోన్లలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. రైలు కార్యకలాపాల్లో నిమగ్నమైన లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు పాయింట్ స్టేషన్ మాస్టర్లు, గార్డులు ఇతర సిబ్బందికి భద్రత విధానాలపై ప్రాక్టికల్ డెమో తో పాటు కౌన్సిలింగ్ సెక్షన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైళ్లను సురక్షితంగా నడిపేందుకు భద్రత విధానాలను కచ్చితంగా పాటించాలని ఆయన అధికారులు ఆదేశించారు. సిబ్బంది పనివేళపై కూడా ఆయన చర్చించారు. సిబ్బందికి సరైన విశ్రాంతి ఇవ్వడానికి ఖచ్చితమైన ప్రణాళికను చేపట్టాలని డివిజనల్ రైల్వే మేనేజర్ల అందరికీ అరుణ్ కుమార్ జైన్ సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *