బేగంపేట అక్టోబర్ 8 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆర్టీసి బస్సు ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ,ప్రజలపై భారాన్ని మోపే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెంచిన బస్సు చార్జీలను తగ్గించే వరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామని పేర్కొన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 9 వ తేదీన నగరంలోని వివిధ ప్రాంతాల నుండి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులలో ఆర్టీసి క్రాస్ రోడ్ లోని బస్ భవన్ కు చేరుకొని వినతిపత్రం అందజేయనున్నట్లు వివరించారు.
రెతి ఫైల్ బస్టాండ్ నుండి తలసాని…
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం 10.00 గంటలకు సికింద్రాబాద్ లోని రెతిఫైల్ బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులో బస్ భవన్ వరకు వెళతారు. అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ మాజీమంత్రి హరీష్ రావు లతో కలిసి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ ఎం డి కి వినతిపత్రం అందజేస్తారు.
