సికింద్రాబాద్ జులై 18,(జే ఎస్ డి ఎం న్యూస్)
తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఆషాఢ బోనాల జాతరమహోత్సవాలకు రావాల్సిందిగా ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ ఉత్సవాలకు విచ్చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి,మాజీ ఎంపీ అంజన్ కుమార్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌లను ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు శనివారం కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేద పండితులతో కూడిన బృందం మంత్రి కొండా సురేఖ నివాసానికి వెళ్లి ఆమెకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మాజీ ఎంపీ అంజన్ కుమార్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌లను కూడా ఆలయ ప్రతినిధుల బృందం కలిసి ఆషాఢ బోనాల ఆహ్వాన పత్రికలను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరింది. లష్కర్ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి తెలియజేశారు.
ఆహ్వాన పత్రికలను అందజేసిన వారిలో వేద పండితుడు వేణు మాధవ్ శర్మ, ఎక్స్ అఫీషియో మెంబర్ రామతీర్థ శర్మ,చైర్మన్ సురిటి రామేశ్వర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు చెక్కల రాజేందర్ ముదిరాజ్, గుండెల్లి దేవి వరప్రసాద్, ముప్పిడి కిరణ్,
జీ రమేష్ ,మంత్రి సోనాలి ,గంట గీత సుధీర్ కుమార్, గుంటి మల్లికార్జున్, కటకం భాస్కర్ గుప్తా, సంజయ్ ప్రకాష్, రాకేష్ అగర్వాల్, శ్రీకాంతచారి తదితరులు ఉన్నారు.


