బేగంపేట జులై 18(జే ఎస్ డి ఎం న్యూస్)
ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి యత్నించడంతో పాటు చెవి కమ్మలు దోచుకుని పరారయ్యారు. బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన యువతి(26) వ్యక్తిగత పనిమీద నాగోల్ ప్రాంతానికి వెళ్లింది. శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో నాగోల్ నుంచి ఓ ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ప్యాట్నీ సెంటర్ కు చేరుకుంది. అక్కడ మరో లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో గుర్తుతెలియని ఇద్దరు యువకులు యువతిని బలవంతంగా సమీపంలోని ఓ ఖాళీ స్థలానికి లాక్కుపోయారు. ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో బాధితురాలు కేకలు వేసింది. దీంతో నిందితులు ఆమెను వదిలి చెవి కమ్మలను బలవంతంగా వలుచుకుని అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు 100కు డయల్ చేయడంతో హుటాహుటిన బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఒంటరిగా వున్న యువతిపై లైంగిక దాడి కి యత్నం..కేకలు వేయడంతో చెవి కమ్మలు లాక్కుని పరారైన వ్యక్తులు.
18
Jul