బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో కలిసి శనివారం పరామర్శించారు. శనివారం ఉదయం కొండపి – అనకర్లపూడి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి బస్సు ప్రమాదం పై కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. అనంతరం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….బస్సు ప్రమాదం దురదృష్టకరం, అదృష్టవశాత్తు ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మాట్లాడాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందిస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *