తాళ్లూరు: వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లోకిరెడ్డి గోవిందమ్మ ఆదివారం రాత్రి మండలంలోని శివరామపురం, కొత్తపాలెం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రజ లను కలుసుకుని వారి సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారం లోకి వచ్చాక అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: