ఎన్నికల కమిషన్ తమ బాధ్యతలను విస్మరించింది…..సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట నవంబర్ 2, ( జెఎస్ డీ ఎం న్యూస్ ) :
ఓటరు కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను విస్మరించిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం ఇప్పటి వరకు ఎంత మేరకు జరిగిందనే సమాచారాన్ని డివిజన్ ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అర్హులైన గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైనే ఉందన్నారు. కానీ ఎన్నికల కమిషన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పట్టించుకోని కారణంగా మనమే ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 6 వ తేదీతో నమోదు కార్యక్రమం ముగియనున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని అన్నారు. బస్తీలు, కాలనీలలోని ప్రతి ఇంటికీ, అపార్ట్మెంట్ లకు వెళ్ళి అర్హులైన గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటు వేసిన వారు కూడా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎంతో కష్టపడి అనేకమంది గ్రాడ్యుయేట్ లను ఓటర్లుగా నమోదు చేయించడం పట్ల పార్టీ నాయకులను అభినందించారు. ఈ సమావేశంలో ఓటరు నమోదు కార్యక్రమం ఇంచార్జి గోసుల శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, కుర్మ హేమలత, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, హన్మంతరావు, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, నాయకులు టి. శ్రీహరి, కిషోర్, ఏసూరి మహేష్, అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, సురేష్ గౌడ్, కొండాపురం మహేష్ యాదవ్, జయరాజ్, కరుణాకర్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, ఖలీల్, కూతురు నర్సింహ, అబ్బాస్, గోపిలాల్ చౌహన్, అఖిల్, ఆరీఫ్, శేఖర్, గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *