బేగంపేట నవంబర్ 2,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
బేగంపేటవిమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి కేంద్ర కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద ఆయనకు శాలువా కప్పి, పూలబోకే అందించిఆత్మీయంగా సత్కరించారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్,ఎమ్మెల్యే అభయ్ పాటిల్,ఎం పీ డా. రేఖ శర్మ,ఎమ్మెల్సీ వెంకట నారాయణ రెడ్డీ,ఎమ్మెల్యే అలేటి మహేశ్వరరెడ్డి,ఎం పీ లు డీ. కే. అరుణా, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్,ఎం. రఘునందనరావు,గడ్డం నాగేష్, కొండా విశ్వేశ్వర రెడ్డీ,ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య,సి. అంజిరెడ్డి,మాజీ ఎం పీ గరిక పాటి మోహన్ రావు,మాజీ ఎమ్మెల్సీ పొంగు లేటి సుధాకర్ రెడ్డీ తదితరులు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సాయంత్రం అమీత్ షా పాదయాత్ర నిర్వహించారు. సాయంత్రం గం 5.15నిలకు ఎం జే మార్కెట్ లో అమీత్ షా ప్రసంగించారు. అనంతరం ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని తిరిగి ఢిల్లీ వెళ్ళినున్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: