సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న దానం నాగేందర్ విజయం ఖాయమని సనత్ నగర్ నియోజక వర్గం ఏ బ్లాక్.బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు.మంగళ వారం సనత్ నగర్ నియోజక వర్గం నెహ్రూ పార్క్ ,సనత్ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో అభ్యర్థి దానం నాగేందర్.సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ.షేక్ గౌస్ తదితరులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ గౌస్ మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే దానం గెలుపు పక్కా అయిపోయిందన్నారు.కేవలం మెజార్టీ కోసమే అన్నట్లు ప్రజల స్పందన వుందన్నారు.కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ను అమలు చేస్తోందన్నారు .అభ్యర్థి దానం నాగేందర్ మాట్లాడుతూ సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ తో విజయం అందించాలని ఓటర్లను కోరారు. ఈ ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవీందర్ గౌడ్ . కార్యకర్తలు పాల్గొన్నారు.





