తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేసి వసతుల కల్పనకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరు పీహెచ్సీలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. వైద్యురాలు షేక్ ఖాదర్ మస్తాన్ బి మాట్లాడుతూ ఆస్పత్రిలో వసతులు సక్రమంలేవన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు కాగా, పనులు అసంపూర్తిగా వదిలివేశారని చెప్పారు. ఆసుపత్రి భవనం వర్షానికి ఉరుస్తూ రికార్డులు తడుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. వైద్యశాలలో మరుగుదొడ్లు లేక రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నా యని చెప్పారు. దీనిపై ఎంపీపీ శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రభుత్వ పెద్ద లతో మాట్లాడి నిధులను సమకూర్చి వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. అభివృద్ధి కమిటీ నిధులను మందుల కొనుగోలు వంటి అవసరాలకు వినియోగించాలని సూచించారు. జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ సీజనల్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు .గ్రామాల్లో వైద్యబృందం ఇంటింటికి తిరిగి ప్రజలకు పారిశుధ్యం పట్ల అవగాహన కల్గించాలని కోరారు.
దోమలు ఆవాసులుగా ఉన్న ప్రాంతాల్లో వాటి నివారణకు తగు చర్యలు చేపట్టాలన్నారు. రికార్డులను పరిశీలించా రు. కార్యక్రమంలో వైద్యులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
