అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమీర్ పేట మండల పరిధిలోని 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ ఇంటి ఆడపడుచు పెండ్లికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు తమ పరిసరాలలో అర్హులైన వారు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, తహసీల్దార్ భీమయ్య, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, ఏసూరి మహేష్, కుర్మ లక్ష్మీపతి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
