ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఐ.ఆర్.ఐ.ఎఫ్.ఏం) 15 జూలై 2024న “ఫోరెన్సిక్ అకౌంటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్ మరియు అకౌంటింగ్”పై మొట్ట మొదటిసారిగా ఒక వినూత్నమైన శిక్షణను ప్రారంభించింది. ఈ కోర్సు హైబ్రిడ్ మోడ్లో ప్లాన్ చేయబడింది. ఈ శిక్షణ పరిమిత కాల వ్యవధితో భారతీయ రైల్వేలలోని ఐ.ఆర్.ఏ.ఎస్(ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్) అధికారులందరికి ఇవ్వబడుతోంది.
రైల్వేబోర్డు, మెంబర్ ఫైనాన్స్ శ్రీమతి రూప శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని రంగాలలో డిజిటలైజేషన్ వేగంగా దూసుకువెల్లుతున్న తరుణంలో ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ రూపంలో ఏది కనిపించినా అది ఖచ్చితమైనదని విశ్వసించే సాధారణ ధోరణి ఉంది. ముఖ్యంగా ఎక్కువ పరిమాణంలో డేటాను నిర్వహించినప్పుడు డిజిటలైజ్డ్ డేటా తారుమారు చేయుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు మార్పిడి చేసిన డేటాను గుర్తించడం చాలా కష్టం. ఇలా తారుమారు చేసిన తప్పుడు డేటాను కనుక్కోవడానికి ఫోరెన్సిక్ అకౌంటింగ్, డిజిటల్ మరియు సైబర్ ఫోరెన్సిక్స్ గురించిన ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండటం అత్యవసరం.అన్నారు.
ఐపాస్ , ట్రాఫిక్ ఖాతాలపై కొత్త అప్లికేషన్ల గురించి మనకు తగిన పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.మెంబర్ ఫైనాన్స్, రైల్వేబోర్డు ఈ కోర్సు రూపకల్పనలో ఐ.ఆర్.ఐ.ఎఫ్.ఏం చేసిన కృషిని అభినందిస్తూ ఈ శిక్షణలో పాల్గొనే వారందరికీ ఫలప్రధమైన శిక్షణా అనుభవాన్ని కాంక్షించారు.
ఐ.ఆర్.ఐ.ఎఫ్.ఏం డైరెక్టర్ జనరల్ శ్రీమతి అపర్ణ గార్గ్ తన స్వాగత ప్రసంగంలో ఈ ఫ్లాగ్షిప్ కోర్సు చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ కోర్సు ఎన్.ఎఫ్.ఎస్.యూ/అహ్మదాబాద్ మరియు ఎన్.ఎఫ్.ఎస్.ఎల్./హైదరాబాద్లోని సంభందిత శాఖల నిపుణులతో సంప్రదించి రూపొందించ బడింది అన్నారు. కార్పొరేట్ సంస్థల ఆర్థిక నివేదికల గురించి లోతైన అవగాహన మరియు వాటిని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అందించడం లక్ష్యంగా తీర్చిదిద్దబడిందన్నారు. ఐ.ఆర్.ఐ.ఎఫ్.ఏం. ఆన్ బోర్డు విధానంలో విశిష్ట చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు సి.ఆర్.ఐ.ఎస్ మరియు సి&ఏ.జి కార్యాలయంలోని అనుభవజ్ఞులైన అధికారులతో పాటు కొంతమంది రిటైర్డ్ మరియు సర్విస్ లోనున్న రైల్వే అధికారులు కూడా ఈ శిక్షణ ను పొందవచ్చుఅన్నారు. ప్రస్తుత బ్యాచ్ యొక్క అభిప్రాయాన్ని మరియు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని రా బోయే కాలానికి ఈ మాడ్యూల్ లో తగిన విధంగా మార్పులు చేర్పులు చేయబడతాయని హామీ ఇచ్చారు.
ఐ.ఆర్.ఐ.ఎఫ్.ఏం అడిషనల్ డెరైక్టర్ బి.సింగయ్య మాట్లాడుతూ 60 గంటలపాటు నిర్వహిస్తున్న ఈ కోర్సు వివరాలను క్లుప్తంగా తెలియజేశారు. ఈ కోర్సు ప్రారంభ సమావేశంలో జోనల్ రైల్వేల ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు మరియు రైల్వే బోర్డు సీనియర్ ఫైనాన్స్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఫోరెన్సిక్ అకౌంటింగ్పై శిక్షణా తరగతులు ప్రారంభం………………..
16
Jul