భారత దేశంలో హిందూ సనాతన ధర్మం, హిందూ సమాజం బలీయంగా ఉండటానికి ఆలయాలు, గురుకులాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని విశ్వహిందూ పరిషత్ ప్రాంత మఠ మందిర్ అర్చక పురోహిత్ ప్రముఖ్ శివ శంకర్ అన్నారు. ఒంగోలు నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవన్లో అర్చక పురోహిత్ మఠ మందిర్ ప్రముఖులతో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లిఖార్జున రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దక్షిణ ప్రాంత మఠ మందిర్ అర్చక ప్రముక్ వ్యామజాల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామి వారిని పూజించినప్పుడే ఆలయాలకు మరింత ఆదరణ తద్వారా హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతుందని పేర్కోన్నారు. సంస్కృతి సంప్రదాయం పాటిస్తే హిందూ సమాజం మరింత ఉన్నత స్థితికి చేరుతుందని వివరించారు. 28 మందిపురోహితులతో పాటు ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ సోమ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు



