ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి -గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్యాన్ని పెంపొందించాలి -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఎంపీడీఓలు, ఎమ్మార్వోలతో మంత్రి స్వామి విడివిడిగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రెవిన్యూ సమస్యలు,గ్రామాల్లో పారిశుద్ధ్యం,వీధి లైట్లు వంటి ప్రజా సమస్యలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలి.రైతుల భూ సమస్యలు, ఆన్లైన్ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్యాన్ని పెంపొందించాలి. డ్రెయిన్లు,సైడ్ కాలువల్లో ఎప్పటికప్పుడు పూడిక తీయాలి. గ్రామాల్లోని అన్ని వీధుల్లో లైట్లు ఏర్పాటు చెయాలి. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యతగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *