రాష్ట్ర స్వచ్చ అవార్డులు పొందిన డీపీఓ వెంకటేశ్వర రావు, మోప్మా పీడీ శ్రీహరి, ఆర్ ఎల్ పురం సెక్రటరీ నరేంద్ర లను జిల్లా కలెక్టర్ రాజా బాబు మంగళవారం అభినందించారు. కలెక్టర్ ఛాంబర్లో వారు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి అవార్డు ప్రధానోత్సవం గురించి వివరించారు. జిల్లా నుండి అవార్డు రావటానికి పనితీరు కనపరచిన అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.

