బేగంపేట డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలి…..సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం.

బేగంపేట అక్టోబర్ 8(జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని,మరింత బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధాం అన్నారు.బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీకి చెందిన కాంగ్రెస్ నాయకులు నసీరుద్దీన్ (అడ్డూ) ఆధ్వర్యంలో తనను కలిసి దసరా శుభాకాంక్షలు తెలియ జేసిన సందర్భంగా వారిని కోరారు.ఈ సందర్భంగా విశాల్ సుధాం మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కోట నీలిమ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తున్నారని,ఆమె ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో పార్టీ నాయకులను,కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు.అలాగే ప్రతి వార్డు లో పర్యటించి బూత్ కమిటీలను సైతం మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నసీరుద్దీన్(అడ్డూ)మాట్లాడుతూ బేగంపేట డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నీ కోట నీలిమ నేతృత్వం లో విశాల్ సుధాం ఆధ్వర్యంలో మరింత బలోపేతం చేస్తామన్నారు.ఇప్పటికే విశాల్ సుధాం ఆధ్వర్యంలో డివిజన్ లోని అన్ని బస్తీల్లో వివిధ రకాలైన అభివృద్ధి,సంక్షేమ పథకాలను కోట నీలిమ చేతుల మీదుగా అందించారన్నారు.అలాగే అభివృద్ధి పనుల విషయంలోనూ ఒక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని.వారిరువురి నేతృత్వం లో బేగంపేట డివిజన్ లో రానున్న జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ను రెప రెప లాడించేందుకు ప్రతి కార్యకర్త చేయి చేయి కలిపి విశాల్ సుధాం ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని అన్నారు.విశాల్ సుదాం ను కలిసి శుభాకాంక్షలు తెలియ జేసిన వారిలో నసీరుద్దీన్ (అడ్డూ) తో పాటు సిద్దిక్ ఖాన్, ఆయూబ్,చిరంజీవి,షేక్ సిద్దిక్,నవాజ్,ఇలియాస్ తది తరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *